Home » Telugu News » పెళ్లయ్యాక ప్రియుడితో టచ్‌లోకి.. అనూహ్యంగా శవమైన ప్రియురాలు.. ఆమె చాటింగ్‌లో ఏముంది?

పెళ్లయ్యాక ప్రియుడితో టచ్‌లోకి.. అనూహ్యంగా శవమైన ప్రియురాలు.. ఆమె చాటింగ్‌లో ఏముంది?

వివాహేతర సంబంధాల మోజులో కాపురాలు కూలిపోతున్నాయి. ఆలుమగల మధ్య ఆప్యాయతలు పోయి అనుమానాలు.. అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్నోళ్లని మోసం చేసి పరాయి వ్యక్తులతో పెట్టుకునే రహస్య సంబంధాలు దారుణాలకు దారితీస్తున్నాయి. ఎక్కడికి దిగజారిపోతున్నామో తెలుసుకునేలోపే అమానుష ఘటనలు జరిగిపోతున్నాయి. చీకటి వ్యవహారం బయటపడుతుందని కొందరు.. బయట పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ మరికొందరు నీచానికి ఒడిగడుతున్నారు. అలాంటి దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. పెళ్లయ్యాక కూడా పాత ప్రియుడితో దగ్గరైన ప్రియురాలు అనూహ్యంగా దారుణ హత్యకు గురైంది. ఆమెను ప్రియుడే కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది.

భువనేశ్వర్‌‌లోని భీమతంగి హౌసింగ్ బోర్డు కాలనీలో రమేష్ సాహు, సుప్రియ(పేర్లు మార్చాం) దంపతులు నివాసముంటున్నారు. వారికి 2014లో వివాహమైంది. మూడేళ్ల కొడుకు ఉన్నాడు. సుప్రియకి జాజ్‌‌పూర్‌కి చెందిన జగన్నాథ్ ప్రదాన్‌తో పెళ్లికి ముందే పరిచయం ఉంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. అయితే అది ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లలేదు. ఇటీవల పాత ప్రియుడితో ఆమె టచ్‌లోకి వెళ్లింది. ఇద్దరూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసుకునేవారు. అది భర్తకి తెలియకుండా సుప్రియ జాగ్రత్తపడేది. వెంటనే చాటింగ్ హిస్టరీ డిలీట్ చేసేది.

అనూహ్యంగా సుప్రియ దారుణ హత్యకు గురైంది. ప్రియుడు జగన్నాథ్ ప్రదాన్ ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేయబోయే ముందు సుప్రియ భర్త రమేష్‌కి వాట్సాప్ వీడియో కాల్ చేసి వెంటనే కట్ చేశాడు. అనుమానం వచ్చిన రమేష్ సాహు తన ఇంట్లో నుంచే ఫోన్ చేసినట్లు గుర్తించి వెంటనే ఇంటి ఓనర్‌కి ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్లి ఒకసారి చూడమని చెప్పడంతో యజమాని తన కొడుకుతో రమేష్ ఉంటున్న పోర్షన్‌కి వెళ్లాడు.

తలుపులు గడియ పెట్టి ఉండడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసి షాక్‌కి గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న సుప్రియ, పక్క గదిలోనే ఆత్మహత్యాయత్నం చేసిన జగన్నాథ్‌ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సుప్రియ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి నుంచి ఓ లెటర్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సుప్రియ సహా ఆమె మూడేళ్ల కొడుకుని సైతం హతమార్చాలని రాసి ఉండడంతో అవాక్కయ్యారు.

జగన్నాథ్ ఇంటికి వచ్చిన సమయంలో సుప్రియ కొడుకు యజమాని ఇంట్లో ఆడుకుంటూ ఉండడంతో ప్రాణాలతో బతికిపోయాడు. ప్రియురాలితో రహస్య సంబంధం కొనసాగిస్తున్న జగన్నాథ్.. ఆమెను ఎందుకు చంపాలనుకున్నాడు? ఆమె కొడుకుపై కోపమెందుకు? తాను ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడు? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె చాటింగ్ హిస్టరీ డిలీట్ చేసే అలవాటుతో ఆధారాలు లభించకుండా పోయాయి. పోలీసులు సాంకేతికంగా ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె చాటింగ్ హిస్టరీని కనిపెట్టే పనిలో పడ్డారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ప్రియుడు కళ్లు తెరిస్తే కానీ అసలు విషయం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. నమ్మకంగా దగ్గరైన ప్రియుడు అంత కిరాతకంగా ఎందుకు హత్య చేశాడన్న దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: ప్రియురాలి భర్తతో.. ప్రియుడి భార్య డీల్.. అనంతపురంలో షాకింగ్
Read Also: భార్య ‘వేషాలు’ చూడలేక.. కుమిలిపోయిన భర్త.. చివరికి..


Source link

x

Check Also

భారీ వర్షాలతో మహారాష్ట్రలో అల్లకల్లోలం-136కి చేరిన మృతుల సంఖ్య-రాబోయే 48గం. కీలకం…

India oi-Srinivas Mittapalli | Published: Saturday, July 24, 2021, 1:45 [IST] భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం ...